చాలామందికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఒక సమస్య. అమ్మో ఖరీదైన ఆహారం, మానవల్ళ కాదు అనుకొంటారు. ఖరీదైన ఆహారం తిన్నంత మాత్రాన ఆరోగ్యం రాదు. అలాగైతే ధనికులందరు ఆరోగ్యం గానే ఉండాలి, కానీ ఆది సాధ్యం కాదు. ఆరోగ్యం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక ఖరీదైన ఆహారం తినే ధనికుడు, మామూలు ఆహారం తీసుకొనే ఒక పేడవానికంటే త్వరగా అనారోగ్యం పాలవా వచ్హు, కాబట్టి ఇటువంటి ఆలోచనలు కేవలం ఒక అపోహ మాత్రమే. ఇక్కడ బలవర్ధక మైన ఆహారం తీసుకోవడం మాత్రమే
ఆరోగ్యానికి మూల సూత్రమని మీరు గ్రహించాలి. దీనినే మనం క్వాలిటీ ఫుడ్ గా చెప్పవచ్చు. అంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కొనే ఆహారం కాదని మీరు గమనించాలి. కల్తీ లేని ఆహారం అని నా ఉద్దేశ్యం. ఈరోజుల్లో కల్తీ లేని ఆహారం దొరకడం చాలా కష్టం గానే ఉంది. మనం తినే కూరగాయలు కూడా మందు మాకు వేసి పెంచినవే. అంతా హైబ్రిడ్. వీటి వల్ల పంట ఎక్కువగా పండుతుందేమో కానీ వీటిలో ఉండే పోషకాలు మాత్రం అంతంత మాత్రమే, అఢ్క దిగుబడి ఇవ్వడమే వీటి ప్రధాన ఉదేశ్యం. అందు వల్ల మనబొటి వాళ్ళ ఆరోగ్యం కూడా అంతంతమాత్రం గానే ఉంటోంది. ఒకప్పుడు అరవై సం|| పై బడిన వారికి పెద్ద రోగాలు వచ్చేవి. మరి ఇప్పుడు ముప్పై సం|| లకే ఎక్కడ లేని రోగాలు వస్తున్నాయి. కారణం? మనం తినే తిండే. ఫుడ్ లో క్వాలిటీ లేక పోవడం. అంటే మన ఆరోగ్యం లో కూడా క్వాలిటీ లేనట్టే, కాదంటారా?. చిన్న వయసులొనె వెంట్రుకలు తెల్ల బడటం, కీళ్ళ నెప్పులు, గుండె జబ్బులు, ఆస్త్మా వంటి అనేక రోగాలతో ఎంతో మంది బాధ పడుతున్నారు. ఒకప్పుడు రోగాలు తక్కువే, డాక్టర్ లు తక్కువే. మరి ఇప్పుడు రోగలు ఎక్కువే, డాక్టర్లు ఎక్కువే! ఫీజులు ఎక్కువే! ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని ఎక్కువే!
Filed under: health | Leave a Comment »