“ఆరోగ్యమేమహాభాగ్యం” అన్నది అందరికి తెలిసిన సత్యం. అంటే మనిషి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటే, అతడు సుఖంగాను, సంపదతోనూ ఉన్నట్టే లెక్క. మనం చక్కగా ఉంటేనే మనం కష్టపడి పనిచేసి సంపాదించగలం, నలుగురికీ సహాయ పడగలం. కాదంటారా? మరి అటువంటి ఆరోగ్యాన్నిపరిరక్షించుకోవడం మన భాధ్యత. ఇది మన చేతిలో పని. ఆరోగ్యం అంటే కేవలం శారీరకమైనదే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మనిషికి అవసరం. ఈ రెంటిలో దేనిలో సమతౌల్యం లోపించినా మనం అనారోగ్యం బారినపడతాం. కాబట్టి ఈ రెండిటి విషయం లోను జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
Filed under: Uncategorized